Oct 23, 2022, 10:55 AM IST
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికే హాట్ టాపిక్. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఈ ఉపఎన్నికతో ఏదో సంబంధాన్ని కలిగివుంటోంది. ఇలా తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని నార్సింగి ప్రాంతంలో పట్టుబడిన కోటి రూపాయల నోట్లకట్టలు మునుగోడుకే తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోకాపేటలోని లెజెండ్ చెమ్స్ విల్లాస్ నుండి రెండు కార్లు, ఓ బైక్ పై మునుగోడుకు తరలిస్తుండగా పోలీసులు చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఒక్కో కారులో రూ.35 లక్షలు, బైక్ లో రూ.30 లక్షలు చొప్పున మొత్తం కోటి రూపాలయను తరలిస్తూ దేవల్ రాజు, శ్రీకాంత్ సాగర్, విజయ్ కుమార్, దేవులపల్లి నగేష్, దాసరి కుమార్ పట్టుబడ్డారు. హర్షవర్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి, కోమటిరెడ్డి సుమంత్ రెడ్డి, కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి పరారయినట్లు పోలీసులు తెలిపారు.