Jul 4, 2020, 2:45 PM IST
కట్టి ఆర్నెళ్లు కూడా కాకముందే మిషన్ భగీరథ వ్యాటర్ ట్యాంకర్ కూలిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండల పరిధిలో గల చింతపల్లి గ్రామంలో ఇటీవలే మిషన్ భగీరథ కోసం ఓ వాటర్ ట్యాంక్ నిర్మించారు. మొత్తం రెండు ట్యాంకులను నిర్మించగా…అందులో ఒకటి పక్కకు ఒరిగి ప్రమాదకర స్థాయికి చేరింది. పక్కనే స్కూల్ ఉండటంతో ఎప్పటికైనా ప్రమాదం అని అధికారులు ఆ ట్యాంకును కూల్చేశారు. ఈ ట్యాంకు నిర్మాణానికి దాదాపు
15లక్షల వరకు ఖర్చు అయి ఉంటుందని అంచనా. కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అవినీతితోనే ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్థులతో పాటు పలువురు ఆరోపిస్తున్నారు.