Shubman Gill, Rohit Sharma
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా భారత్ ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరగ్గా చెరో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేశాయి. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విక్టరీని అందుకుంది. ఆడిలైడ్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఘోరంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఒత్తిడిలోకి జారుకున్న భారత జట్టు రాబోయే మూడో టెస్టులో విన్నింగ్ ట్రాక్ లోకి రావాలని చూస్తోంది.
అయితే, ఆస్ట్రేలియా జట్టుతో కీలకమైన బ్రిస్బేన్ గబ్బా టెస్టుకు ఒక రోజు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై భారత జాతీయ క్రికెట్ జట్టు బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అతని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
2020-21 సీజన్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత తొలిసారిగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మ్యాచ్ గురించి శుభ్‌మాన్ గిల్ మాట్లాడాడు. రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ కు రాకపోవడం గురించి కూడా ప్రస్తావించాడు.
రోహిత్ శర్మ తగినంతగా ప్రాక్టీస్ చేశాడని తాను భావిస్తున్నానని శుభ్ మన్ గిల్ పేర్కొన్నాడు. బ్రిస్బేన్ టెస్టుకు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు భారత కెప్టెన్ రోహిత్ హాజరుకాలేదు. బదులుగా, టీమ్ మేనేజ్‌మెంట్ యంగ్ ప్లేయర్ గిల్‌ని మీడియాతో ఇంటరాక్ట్ కోసం పంపింది.
కీలక మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించలేదు. రోహిత్ శర్మ గైర్హాజరు గురించి శుభ్‌మన్ గిల్‌ను మీడియా ప్రశ్నించగా, రోహిత్ అప్పటికే మ్యాచ్ కోసం తగినంత ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించాడు.
Image Credit: Getty Images
హిట్ మ్యాన్ మ్యాచ్ కోసం మరింత తాజాగా ఉండటానికి ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్‌ను దాటవేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు. "అవును, ఇది ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్.. అతను తగినంతగా ప్రాక్టీస్ చేశాడని నేను భావిస్తున్నాను" అని భారత యంగ్ ప్లేయర్ గిల్ తెలిపాడు.
కాగా, ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతని చివరి 6 టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాటింగ్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా 6, 5, 23, 8 స్కోర్‌లను నమోదు చేశాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో 2, 52, 0, 8, 18, 11 స్కోర్‌లతో మరోసారి విఫలం అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అంటే అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో 3, 6 పరుగులు మాత్రమే చేసి మరోసారి దారుణంగా విఫలమయ్యాడు.
Rohit sharma and Jaiswal
కాగా, గబ్బా టెస్టులో తాను మెరుగైన ప్రదర్శన చేయడాని సిద్ధంగా.. నమ్మకంగా ఉన్నాని గిల్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2020-21 భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలకంగా ఉన్న ప్లేయర్లలో గిల్ ఒకడు. మళ్లీ ఆ వేదికపై ఆడడంపై తాను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని చెప్పాడు. “నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 2021 విజయం తర్వాత మళ్లీ అదే స్టేడియంలో నడవడం.. ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేస్తాననే నమ్మకంతో ఉన్నానని చెప్పాడు.