`ఫీయర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. వేదిక భయపెట్టిందా?

Published : Dec 13, 2024, 11:49 PM IST

వేదిక హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ `ఫీయర్‌`. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ శనివారం(డిసెంబర్‌ 14)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
`ఫీయర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. వేదిక భయపెట్టిందా?

వేదిక `విజయదశమి`, `బాణం`, `రూలర్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ హీరోయిన్‌గా తెలుగులో సక్సెస్‌ కాలేదు. ఇటీవల ఆమె `రజాకార్‌` సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు `ఫీయర్‌` అంటూ తెలుగు ఆడియెన్స్ ని భయపెట్టేందుకు వస్తుంది. ఈ చిత్రానికి డా హరిత గోగినేని దర్శకత్వం వహించారు.

దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై డా వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి నిర్మించారు. వేదికతోపాటు పవిత్ర లోకేష్‌, అరవింద్‌ కృష్ణ, జయప్రకాష్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీ రేపు శనివారం(డిసెంబర్‌ 14)న విడుదల కానుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి `ఫీయర్‌` సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

26

కథః 
సింధు(వేదిక) మానసిక వ్యాధితో బాధపడుతుంది. మెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కట్‌ చేస్తే సింధు తమ తల్లిదండ్రులకు(జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌)లకు కవల సంతానం. ఇందు(వేదిక), సింధు. ఇద్దరు కలిసి పెరుగుతారు. కలిసి చదువుకుంటారు. అయితే చిన్నప్పుడు అమ్మ అన్నం తినడం కోసం బూచోడు స్టోరీ చెప్పి భయపెడుతుంది. ఆ భయం సింధులో అలానే ఉండిపోతుంది. రోజు రోజుకి పెరిగిపోతుంది.

అక్క ఇందు ఆటల కోసం పాతబడ్డ ఇంటికి తీసుకెళ్లడం, దెయ్యం సినిమాలు చూపించడంలో మరింతగా భయపడిపోతుంది సింధు. అదే సమయంలో ఆమెలో చాలా జెలసీ ఉంటుంది. తాను వెళ్లే ట్యూషన్‌కి సంపత్‌ అనే కుర్రాడు వస్తాడు. మొదట ఆమెతోనే మాట్లాడతాడు. దీంతో అతనికి క్లోజ్‌ అవుతుంది. అతనితో అక్క ఇందు మాట్లాడినా తట్టుకోదు సింధు. అక్కని కూడా సంపత్‌కి దూరంగా ఉండాలని వార్నింగ్‌ ఇస్తుంది.

మరోవైపు తనని ఎవరో వెంటాడుతున్నట్టుగా ఫీలవుతుంటుంది సింధు. స్కూల్‌లో తోటి స్కూడెంట్స్ ని కొడుతుంది. ఆమె ప్రవర్తన వల్ల ఇబ్బంది పడ్డ స్కూల్‌ యాజమాన్యం ఆమెని ఇంటి నుంచే చదువుకోవాలని చెబుతారు. ఇంట్లోనే చదువుకుంటున్న సింధు సంపత్‌ జ్ఞాపకాలతోనే పెరుగుతుంది, పెద్ద అవుతుంది. చివరికి సంపత్‌ ఇంటికి వెళ్తుంది, ఆయనతోనే వారి ఫ్యామిలీతో ఉంటుంది.

అయితే జాబ్‌ వర్క్ మీద బయటకు వెళ్లిన సంపత్‌ తిరిగిరాదు, దీంతో మరింత ఒంటరి ఫీలవుతుంది. ఎవరో వెంపడుతున్నట్టుగా, తనని చంపాలని చూస్తున్నట్టుగా భావిస్తుంది. మరి సింధుని వెంబడిస్తున్నది ఎవరు? సంపత్‌ ఎక్కడికి వెళ్లాడు? తాను మెంటల్‌ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు సింధుకి ఉన్న సమస్య ఏంటనేది మిగిలిన కథ. 

36

విశ్లేషణః

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీస్‌ అడపాదడపా వస్తూనే ఉన్నాయి. కాకపోతే మనవద్ద కాస్త తక్కువనే చెప్పాలి. అందులోనూ ఆదరణ పొందిన సినిమాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి కథాంశంతోనే సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా `ఫీయర్‌` సినిమాని రూపొందించారు దర్శకురాలు హరిత గోగినేని. ఈ మూవీ ద్వారా ఓ మానసిక సమస్యని జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. స్క్రిజోఫ్రెనియా(Schizophrenia - mental asylum) మెంటల్‌ డిజార్డర్‌ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కథ పరంగా మంచి సందేశాన్ని అందించే చిత్రమిది.

ప్రస్తుత సమాజంలో, పోటీ ప్రపంచంలో, కాలంతో పరిగెత్తే క్రమంలో పేరెంట్స్ పిల్లలను సరిగా చూసుకోవడం లేదు. వారికి టైమ్‌ ఇవ్వడం లేదు. దీంతో మానసిక రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల్లో లేనిపోని భయాలు క్రియేట్‌ చేయడం వల్ల అది ఎంతగా ఇబ్బంది పెడుతుంది, ఎంతగా ప్రభావం చూపిస్తుందనేది తెలియజేసే చిత్రమిది.

ఒక సీరియస్‌ విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడం అభినందనీయం. సినిమాగా చూసినప్పుడు వేదిక ఆసుపత్రిలో మానసిక రోగిగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఆమె సంపత్‌ కోసం తపించడం సీన్లతో సినిమా అంతా సాగుతుంది. ఓ వైపు ఆసుపత్రిలో ఆమె సంపత్‌ని తలుచుకోవడం, ఈ క్రమంలో చిన్నప్పటి సీన్లు, ఆ తర్వాత సంపత్‌తో జర్నీ సీన్లు, ఆయన కోసం వెతుకులాడే సీన్లు వస్తుంటాయి. ఇవన్నీ పారలల్‌గా సాగుతుంటాయి. 
 

46

ఓ వైపు సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది, మరోవైపు కొంత కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేస్తుంది. కానీ సస్పెన్స్ అంశాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతాయి. సింధుని అజ్ఞాత వ్యక్తులు వెంబడించే సీన్లు, తను భయపడే సీన్లు ఆడియెన్స్ లోనూ భయాన్ని క్రియేట్‌ చేస్తాయి. సినిమా మొత్తం ఇలా సస్పెన్స్ అంశాలతో సాగుతూ నెక్ట్స్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. అయితే ఏక కాలంలో అటు ఆసుపత్రి సీన్లు, చిన్నప్పటి సీన్లు, మరోవైపు సంపత్‌తో సీన్లు రావడంలో ఆడియెన్స్ కన్‌ఫ్యూజ్‌ అవుతారు.

ఏది నిజం, ఏది ప్రస్తుతం అనే సందిగ్ధం ఏర్పడుతుంది. కథ పరంగా, అనేక అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తుతాయి. సినిమా కథనం సాగే తీరు విషయంలోనూ  కేర్‌ తీసుకోవాల్సింది. మరింత గ్రిప్పింగ్‌గా, మరింత ఎంగేజింగ్‌గా తీయాల్సింది. చివరి వరకు సస్పెన్స్ తో సాగినా, క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్, వివరణ జస్టిఫికేషన్‌ అనిపిస్తుంది. అయినా చాలా లాజిక్‌లు మిస్‌ అయినట్టుగా ఉంటుంది. మరోవైపు కొన్ని చోట్ల కొంత బోర్‌ ఫీల్‌తెస్తుంది. కొన్ని సీన్లు రిపీటేషన్‌గానూ అనిపిస్తాయి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. కానీ ఈ మూవీ ద్వారా మంచి సందేశం అందించారు మేకర్స్. పిల్లల్లో మానసిక స్థితి గురించి, పేరెంట్స్ ఎలా వ్యవహరించకూడదు, ఎలా చూసుకోవాలనేది తెలియజేసే ప్రయత్నం చేశారు. సమాజంలో ఉన్న సమస్యను కళ్లకి కట్టినట్టు `ఫీయర్‌` ద్వారా ఆవిష్కరించడం అభినందనీయం.

56

నటీనటులుః 

సింధుగా వేదిక నటించి మెప్పించింది. నటిగా తనలోని మరో యాంగిల్‌ని చూపించింది. ఇంకా చెప్పాలంటే తన నటనతో అందరిని ఎంగేజ్‌ చేసింది. మెస్మరైజ్‌ చేసింది. సింపుల్‌గా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. సీరియల్‌ లుక్‌లో, భయపడుతూ, బాధపడుతూ, జెలసీ ఫీలవుతూ ఇలా విభిన్నమైన ఎమోషన్స్ ని పలికించి మెప్పించింది. ఇందు పాత్రలోనూ కాసేపు మెరిసి మెప్పించింది వేదిక. సినిమా మొత్తం ఆమె చుట్టూతే సాగుతుంది.

ఇక తల్లి పాత్రలో పవిత్ర లోకేష్‌ కనిపించింది. తన పాత్ర మేరకు చేసింది. అలాగే తండ్రి పాత్రలో జయప్రకాష్‌ సైతం తన పాత్రపరిధి మేరకు ఓకే అనిపించారు. సంపత్‌ పాత్రలో అరవింద్‌ కృష్ణ బాగా చేశారు. ఆయన పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉంటుంది. షయాజీ షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని గెస్ట్ తరహా పాత్రలతో ఫర్వాలేదనిపించారు. 
 

66

టెక్నీషియన్లుః 
సినిమా టెక్నీకల్‌గా హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విజువల్స్, బీజీఎం అదిరిపోయాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్రాణం పోసింది. సైలెన్స్ తో కూడిన సీన్లు కూడా అదరగొట్టాయి. హార్ట్ బ్రేక్‌ చేసేలా సౌండింగ్‌, సస్పెన్స్ సీన్లలో వచ్చే బీజీఎం మతిపోగొడుతుంది. వణుకుపుట్టిస్తుంది. హర్రర్‌ సినిమాలను తలపిస్తుంది.

ఈవిషయంలో మ్యూజిక్‌ డైరెక్టర అనూప్‌ రూబెన్స్ ని అభినందించాల్సిందే. ఇటీవల కాలంలో త బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. బీజీఎంతో అదరొట్టాడు. ఐ ఆండ్రూ కెమెరా వర్క్ కూడా బాగుంది. దర్శకురాలి హరిత గోగినేని ఇలాంటి ఒక డ్రై సబ్జెట్‌ని ఎంచుకోవడం గొప్ప విషయం. పైగా సందేశాన్ని ఇలా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తీయడం మరో గొప్ప విషయం. జనాల్లో అవగాహన కల్పించే ప్రయత్నం కూడా అబినందనీయం. 

ఫైనల్‌గాః సందేశం కోసం చూడాల్సిన మూవీ `ఫీయర్‌`
రేటింగ్‌ః 2.75
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories