ప్రపంచంలో విమానాలు తిరగని ఆ ప్రాంతాన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు. ఇది దాదాపు 1.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో 8 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. అయినా విమానాలు తిరగడం అక్కడ చాలా కష్టం. ఎందుకంటే ఆ ఎయిర్ పోర్ట్స్ అన్నీ భూమికి 3,500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతంలో విమానాలు ఎగరడం చాలా కష్టం. ఇంతకీ ఆ ప్రాంతం పేరు ఏంటో తెలుసా? సముద్ర మట్టానికి 5 కి.మీ ఎత్తులో ఉన్న టిబెట్ పీఠ భూమి అది.
టిబెట్ పీఠభూమిపై విమానాలు ఎగరకపోవడానకి ప్రధాన కారణాలలో ఒకటి దాని తీవ్రమైన ఎత్తు. సముద్ర మట్టానికి 5 కి.మీ ఎత్తులో ఉండటంతో అంత ఎత్తులో విమాన ఇంజిన్ల సరిగా పనిచేయవు. అందువల్ల పైలెట్లు కూడా ఆ ప్రాంతం పక్క నుంచి విమానాలు నడపాలన్నా భయపడతారు.
మరో ముఖ్యమైన కారణం ఏంటంటే వాతావరణం. టిబెట్ పీఠభూమిలో వాతావరణం చాలా వింతంగా ఉంటుంది. బలమైన గాలులు, ఎటువైపు నుంచి వీస్తాయో కరెక్ట్ గా ఊహించలేని పరిస్థితి అక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అటుపైపు విమానాలు ఎగిరితే ప్రమాదాలు జరగడానకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
విమానాలు ఎగరకపోవడానికి మరో ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే.. ఈ ప్రాంతంలో చాలా భారీ పర్వతాలు ఉన్నాయి. 7,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న శిఖరాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతం మీదుగా విమానాలు ఎగురుతున్నప్పుడు ఏదైనా అత్యవసరమై ల్యాండింగ్ చేయాలంటే అస్సలు వీలు కాదు. తీవ్రమైన వాతావరణ ఒత్తిడి ఉన్న ఈ ప్రాంతం పైనుంచి విమానం వెళుతుండగా ఇంజిన్ ప్రాబ్లమ్ వస్తే క్రాష్ ల్యాండింగ్ కి తప్ప వేరే అవకాశం ఉండదు.
అయినా ఇక్కడ 8 విమానాశ్రయాలు ఎందుకు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ప్రజల రవాణా కోసం వీటిని ఏర్పాటు చేసినా అది ప్రమాదకరం కావడంతో ప్రస్తుతం కార్గో సేవల కోసం ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల పైలట్లకు సమాచారం అందడం కష్టంగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు కార్గో ఫ్లయిట్స్ ని మాత్రమే ఉపయోగిస్తుంటారు.