ప్రపంచంలోనే అత్యంత అవినీతి పొలిటీషన్స్ మోదీ, అమిత్ షా : మంత్రి ప్రశాంత్ రెడ్డి

Oct 11, 2022, 10:29 AM IST

పెద్దపల్లి : దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరులైన రాజకీయ నాయకులు ఎవరైనా వున్నారంటే అది నరేంద్ర మోదీ, అమిత్ షా లే అని తెలంగాణ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. ఇలా నిరుపేదలు, రైతులు అండగా నిలవాల్సింది పోయి కేంద్రం కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల నుండి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన నీచమైన ఘనత ప్రధాని  మోదీ ది అని మండిపడ్డారు. ఇలాంటి దగుల్ బాజీ బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పై విరుచుకుపడ్డారు.