Dec 10, 2019, 5:20 PM IST
మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులపై ఏజెన్సీ, అధికారులపై సత్యవతి రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, ఎక్కడా రాజీ పడినా సహించేది లేదన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.