Mokshagna Nandamuri
స్టార్ కిడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ హీరో కావాల్సిందే. లేదంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు... హీరోగా నిలబెట్టే బాధ్యత మాది అంటారు. అబ్బాయి హీరో కాకముందే జన్మదిన వేడుకలు జరుపుతారు. ఇదంతా ఒక హీరో మీద అభిమానులు పెంచుకున్న ప్రేమలో భాగమే.
Mokshagna Nandamuri
దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర సీమలో తమకంటూ ప్రత్యేక స్థానం నందమూరి ఫ్యామిలీ కలిగి ఉంది. లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ టాప్ హీరోల్లో ఒకరయ్యారు. తండ్రి వారసత్వం నిలబెట్టారు. ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో జూనియర్ ఎన్టీఆర్. పాన్ ఇండియా హీరోగా ఫేమ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ పర్లేదు అనిపించుకున్నాడు. స్టార్డం మాత్రం రాలేదు. మోక్షజ్ఞ హీరో కావాలనేది నందమూరి అభిమానుల కల. ఓ దశాబ్దకాలంగా వారు ఎదురు చూస్తున్నారు.
బాలకృష్ణకు ఒక్కగానొక్క కొడుకు మోక్షజ్ఞ. నందమూరి డైహార్డ్ ఫ్యాన్స్ కి మోక్షజ్ఞ అంటే చాలా ఇష్టం. కాగా మోక్షజ్ఞ ఎంట్రీ చాలా ఆలస్యమైంది. మోక్షజ్ఞ ప్రస్తుత వయసు 30 ఏళ్ళు. ఈపాటికి మోక్షజ్ఞ కనీసం 10 సినిమాలు చేయాల్సింది. మోక్షజ్ఞ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్... ఆ వయసుకు మాస్ హీరోగా స్టార్డం సొంతం చేసుకున్నారు.
మోక్షజ్ఞకు హీరో కావడం ఇష్టం లేదని కూడా ప్రచారం జరిగింది. మోక్షజ్ఞను తన మానాన తనను వదిలేద్దాం అంటే.. అభిమానులు ఒప్పుకోరు. అతి కష్టం మీద మోక్షజ్ఞ మనసు మార్చి బరిలో దించుతున్నాడు. మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత బాలకృష్ణ ప్రశాంత్ వర్మకు ఇచ్చాడు. పలువురి పేర్లు పరిశీలించాక.. ప్రశాంత్ వర్మ బెస్ట్ ఆప్షన్ అన్నట్లు బాలయ్య భావించారు.
Mokshagna
సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో ఓ కథను మోక్షజ్ఞ కొరకు ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారు. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీర్చిద్దిదాలనే ఆలోచనలో ఉన్నారు. ఖర్చుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది అంటున్నారు. మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ సందిగ్ధంలో పడిందనేది లేటెస్ట్ టాక్.
ప్రశాంత్ వర్మ కథ మాత్రమే సమకూరుస్తాను. డైరెక్షన్ తన శిష్యుడు చేస్తాడని బాలయ్యతో చెప్పాడట. ప్రతిష్టాత్మకమైన మోక్షజ్ఞ ఫస్ట్ చిత్రాన్ని కొత్త దర్శకుడు తీయడం ఏమిటని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడట. బాలయ్య-ప్రశాంత్ వర్మ మధ్య చర్చలు జరుగుతున్నాయట. అందుకే డిసెంబర్ 5న లాంచ్ కావాల్సిన మోక్షజ్ఞ మూవీ వాయిదా పడిందట.
ఒకవేళ మోక్షజ్ఞతో మూవీ పట్టాలెక్కని పక్షంతో అదే కథతో నిర్మాత డీవీవీ దానయ్య కొడుకుతో సినిమా చేయాలి అనేది ప్రశాంత్ వర్మ ఆలోచన అట. ఇక బాలకృష్ణ కూడా ప్రత్యామ్నాయం వెతికే పనిలో ఉన్నాడట. ప్రశాంత్ వర్మకు హనుమాన్ హిట్ తో పొగరు తలకు ఎక్కిందని ఇండస్ట్రీ టాక్. అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ కట్ కోసం ప్రశాంత్ వర్మను సంప్రదించగా పెద్ద మొత్తంలో డిమాండ్ చేశాడట. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు..