Published : Dec 14, 2024, 06:12 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 104: ప్రేరణ ఓట్లు నిఖిల్ కి!

సారాంశం

నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ వేశారు. కాగా ప్రేరణ ఎటూ టైటిల్ రేసులో లేదు. ఆమె కూడా కన్నడ అమ్మాయి. ఈ క్రమంలో ప్రేరణ ఓట్లు నిఖిల్ కి పడుతున్నాయంటూ ఓ వాదన మోడలైంది. 
 

Bigg Boss Telugu 8 live Updates|Day 104: ప్రేరణ ఓట్లు నిఖిల్ కి!

01:42 PM (IST) Dec 14

బిగ్ బాస్ హౌస్ లో సుమ సందడి

 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ఎపిసోడ్ లో యాంకర్ సుమ సందడి చేశారు. బిగ్ బాస్ సుమకి హౌస్ లోకి స్వాగతం చెప్పారు. బిగ్ బాస్ మీ వాయిస్ నా నాయిస్ ఎప్పటికీ బోర్ కొట్టవు అని సుమ మంచి డైలాగ్ చెప్పింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ ని కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ గేమ్స్ ఆడించింది. మీరు ఎప్పుడైనా ఇతరుల టూత్ బ్రష్ వాడారా ? మూడు రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నారా లాంటి ప్రశ్నలు అడిగింది. సుమతో కలసి అవినాష్ బాగా నవ్వించాడు. 

 

06:12 AM (IST) Dec 14

ప్రేరణ ఓట్లు నిఖిల్ కి!

టైటిల్ రేసు గౌతమ్ - నిఖిల్ మధ్య నడుస్తుంది. ఓటింగ్ లో వీరిద్దరూ పోటీపడుతున్నారు. టైటిల్ కూడా వీరిలో ఒకరు అందుకుంటారనే ప్రచారం జరుగుతుంది. గౌతమ్ వైల్డ్ కార్డు ఎంట్రీ కావడం మైనస్, అదే సమయంలో నిఖిల్ కి నాన్ లోకల్ అనే ట్యాగ్ వేశారు. కాగా ప్రేరణ ఎటూ టైటిల్ రేసులో లేదు. ఆమె కూడా కన్నడ అమ్మాయి. ఈ క్రమంలో ప్రేరణ ఓట్లు నిఖిల్ కి పడుతున్నాయంటూ ఓ వాదన మోడలైంది.