డిసెంబర్ 4న విషాదంతో వివాదం మొదలు
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ళ రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు అపస్మారక స్థితితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లు అర్జున్ థియేటర్ ని అనుమతి లేకుండా విజిట్ చేయడం వల్లే ఈ సంఘటన జరిగింది అంటూ పోలీసులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఈ వివాదం మొదలయింది. అయితే అల్లు అర్జున్ వెంటనే స్పందించి రేవతి కుటుంబసభ్యులకు సహాయంగా 25 లక్షలు ప్రకటించారు.