కేంద్ర మంత్రి ఎవడైనా గానీ... వీటికి సమాధానం చెప్పండి: మంత్రి జగదీష్ రెడ్డి

Feb 28, 2023, 10:00 AM IST

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా బిజెపి చేపట్టిన కార్నర్ మీటింగ్స్ పై మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేసారు. వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ  పెద్ద నోరేసుకుని మాట్లాడే బిజెపి నాయకులు ముందు తమ రాష్ట్రాల్లో ఏం అభివృద్ది చేసారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణలో అమలుచేస్తున్న పథకాల్లో కనీసం సగం పథకాలైనా దేశంలోని మరే రాష్ట్రంలోనైనా వున్నాయా? అని అడిగారు. బిజెపి కార్నర్ మీటింగ్ లు, మూల మీటింగ్ చూస్తుంటే 'దొంగదెబ్బ తీసి మూలకు దాసుకున్నారు' అనే వెనకటి సామెత గుర్తుకువస్తోందని అన్నారు. బిజెపి నాయకులు కూడా గల్లీలల్ల మూలకు కూర్చుని అబద్దాలు చెప్పి దొంగదెబ్బ తీయాలనుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.