సమస్యను పరిష్కరించండి సార్..: సీఎం కేసీఆర్ కు హరీష్ రావు ఫోన్

Mar 21, 2021, 1:58 PM IST

గజ్వేల్ నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఫోన్ చేశారు మంత్రి హరీష్ రావు. పంటలు ఎండిపోతున్నాయని... వెంటనే కాళేశ్వరం నీటిని అందించి పంటలను కాపాడాలంటూ అన్నదాతలు హరీష్ ను కోరగా వెంటనే ఆయన సీఎంతో మాట్లాడారు. సీఎం కూడా రైతులకు వెంటనే సహాయం చేయాలని హరీష్ రావుకు సూచించారు. 

కోడకండ్ల వద్ద కెనాల్ ని పరిశీలించిన మంత్రి హరిష్ కెనాల్ నుండి కూడవెళ్లి వాగులోకి నీటిని రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని సీఎంతో మాట్లాడగా... తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని  కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. కూడవెళ్లి పరిసర ప్రాంతాల రైతులకు దాదాపు 10000 ఎకరాలకు నీరు అందివ్వడం జరుగుతుంది హరీష్ రావు అన్నారు.