May 3, 2022, 3:00 PM IST
సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ళ చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరిశ్ రావు మాట్లాడుతూ.... హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పరిమితమైన మోకాలి చిప్పలు మార్పిడిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ప్రారంభిస్తామని అన్నారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. కాబట్టి ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. డబ్బున్నవాళ్ళు మాత్రమే చేసుకునే మోకాలి చిప్పలు మార్పిడి నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చాని మంత్రి హరీష్ పేర్కొన్నారు.