మీ ప్రజలను నూకలు తినమనండంటూ... కేంద్ర మంత్రి గోయల్ ఎంతలా అవమానించాడంటే..: ఎర్రబెల్లి సంచలనం

Mar 25, 2022, 4:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం పక్షాన యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో మంత్రుల బృందం సమావేశమయ్యామని... కానీ ఆయన యావత్ తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి అవమానకరంగా మాట్లాడారని తెలిపారు. ఈ కేంద్రమంత్రికే కాదు తెలంగాణ బీజేపీ నేతలకూ ప్రజలు బుద్ది చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణి మానాలన్నారు. పీయూష్ గోయల్ కు దమ్ముంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో తేల్చుకోవడానికి హైద్రాబాద్ లో చర్చకు రావాలని మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు.