Jan 18, 2023, 12:18 PM IST
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్దమైన కేసీఆర్ మరో ముగ్గురు సీఎంలు, ఒక మాజీ సీఎంతో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మంత్రులు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీ ఏర్పాట్లు, జనసమీకరణ చేపట్టారు. ఇలా పంచాయితీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఆయన అనుచరులు ఖమ్మం సభకోసం ముమ్మర ఏర్పాట్లు చేసారు. తన నియోజకవర్గం పాలకుర్తి నుండి ఖమ్మం సభకు నాయకులు, కార్యకర్తలను తరలిస్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా కొందరు బిఆర్ఎస్ నేతలు మంత్రి ఎర్రబెల్లి ఫోటోలతో మంచినీటి బాటిల్స్ సిద్దంచేసి ఖమ్మం సభలో కార్యకర్తల దాహం తీర్చే ఏర్పాట్లు చేసారు.