ఇంట్లో టార్చర్ భరించలేక.. గోదావరిలో దూకడానికి..

Jun 29, 2020, 2:12 PM IST

కుటుంబ సమస్యల కారణంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి  ఆత్మహత్య కి పాల్పడుతున్న వ్యక్తిని గోదావరి రివర్ పోలీసులు కాపాడారు. సోమవారం ఈ రోజు ఉదయం 11.30 గంటలకు మెరుగు విజయ్ అనే ముప్పై యేళ్ల ఏన్టీపీసీ, అన్నపూర్ణ కాలనీకి చెందిన ఓ వ్యక్తి  కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య కి పాల్పడుతుంటే గమనించిన గోదావరి రివర్ పోలీస్  పీసీ రమేష్ కుమార్ ,పీసీ శంకరయ్య లు అతని ని కాపాడి, పై అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అతనికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు.