Nov 16, 2020, 12:54 PM IST
జగిత్యాల జిల్లా, హైదర్ పల్లె లో ప్రేమికుల ఆత్మహత్య కలకలం సృష్టించింది. జగిత్యాలలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న మధు, తన ప్రియురాలితో కలిసి గ్రామంలోని పాడుబడ్డ ఇంట్లో పురుగుల మందు తాగి దూలానికి వూరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఊరికి దూరంగా ఉండడంతో చనిపోయిన పది, పదిహేను రోజులకు గానీ మృతి చెందిన విషయం వెలుగులోకి రాలేదు. శవాలు కుళ్లిపోయి, గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నాయి.