Mar 2, 2020, 5:19 PM IST
పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు నగరంలోని పలు ప్రాజెక్టులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు.ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేశారు. దుర్గం చెరువు పైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించి అక్కడి కాంట్రాక్ట్ ఏజెన్సీలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత దానికి అనుసంధానంగా రోడ్ నెంబర్ 45 వరకు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మరింత వేగంగా కొనసాగించాలని అధికారులను కాంట్రాక్ట్ ఏజెన్సీలను కేటీఆర్ ఆదేశించారు.