May 5, 2022, 5:43 PM IST
సిద్దిపేట జిల్లా ములుగులోని ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మామిడి, ఆయిల్ పామ్ డెమో బ్లాక్, శ్రీగంధం డెమో బ్లాక్ తో పాటు హార్టికల్చర్, సెరికల్చర్ ఎగ్జిబిషన్ ను మంత్రులు సందర్శించారు. ఉద్యానవనంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ మామిడి పండ్ల చెట్లను పరిశీలించారు. మంత్రుల బృందం ఆయిల్ పామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, వీసీ నీరజా ప్రభాకర్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి తదితరులు పాల్గొన్నారు.