సోదరుడు కేటీఆర్ పిలుపుతో ... ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

Oct 24, 2022, 3:06 PM IST

హైదరాబాద్ : నేతన్నలకు మద్దతుగా మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డుల ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి స్వయంగా తానే లెటర్ రాసి పంపారు కేటీఆర్. ఇలా ప్రతిఒక్కరు చేనేత కార్మికులకు మద్దతుగా ప్రధానికి ఉత్తరాలు రాయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో టీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా ప్రధానికి లెటర్లు రాస్తున్నారు. ఈ క్రమంలోనే సోదరుడి పిలుపును అందుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేనేతకారులకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసారు.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... నైపుణ్యత, సృజనాత్మకత, కష్టాన్ని నమ్ముకున్న కళ చేనేత అని పేర్కొన్నారు. కాబట్టి దీన్ని వ్యాపార కోణంలో చూడకుండా వెంటనే దీనిపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కోరారు.