Jun 3, 2020, 4:07 PM IST
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లికి చెందిన ఉయ్యాల పర్శ రాములు గౌడ్ కొంతకాలంగా దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో అక్కడి ఆసుపత్రిలో చేరగా కరోనా పాజిటివ్ గా నిర్దారించారు. చికిత్స పొందుతూ మే 13న పర్శ రాములు
చనిపోయాడు. ఈ విషయం కనీసం కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా కూడా సమాచారం అందలేదు. అనూహ్యంగా డెత్ సర్టిఫికెట్ కొరియర్ లో రావడంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.