Aug 22, 2020, 3:24 PM IST
శ్రీశైలం జలాశయం ఎడమగట్టువైపు ఉన్న భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి దట్టంగా పొగ కమ్ముకుపోవడంతో సొరంగ మార్గంలో చిక్కుకున్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించారు. దట్టమైన పొగ కమ్ముకుపోయి ఉండడం, సొరంగ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాల్సి ఉండటం సహాయక చర్యలకు ఆటంకాలుగా మారి సొరంగంలో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడడం సాధ్యం కాలేదు.