Dec 9, 2019, 5:07 PM IST
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపోలోనీ ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్నవాళ్లకే డ్యూటీ లు ఇస్తున్నారని కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే అధికారులకు కాల్ చేసిన అందబాటులోకి రావడం లేదని వాపోయారు. రెండు వారాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాలలో చేరాలని చెప్పిన భేషరతుగా డ్యూటీ లు చేస్తున్న కూడా ఆర్టీసీ అధికారులు, యాజమాన్యం కలిసి ఎలాంటి యూనియన్లు వద్దని బలవంతంగా సంతకాలు తీసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.