Nov 2, 2021, 5:34 PM IST
హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో రౌండ్ రౌండ్ కి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ ఈటెల రాజేందర్ దూసుకుపోతుండడంతో బీజేపీ ఆఫీసులో సంబరాలు ప్రారంభమయ్యాయి. 10 రౌండ్ల వరకు కూడా హోరాహోరీగా పోరు సాగినప్పటికీ... జమ్మికుంట మండలానికి సంబంధించిన కౌంటింగ్ కూడా ముగియడం... ఈటల 10 వేళా మెజారిటీ మార్కును కూడా దాటడంతో ఇక గెలుపు ఖాయమని నిశ్చయించుకున్న నాయకులూ సంబరాలను మొదలుపెట్టారు.