వెల్లుల్లి ఎందుకు మొలకెత్తుతుంది?
వెల్లుల్లి మొలకెత్తడం సహజమే అయినప్పటికీ, కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి:
- ముందుగా వెల్లుల్లిని ఎక్కువ రోజులు ఉపయోగించకుండా అలాగే ఉంచితే అది మొలకట్టడం మొదలవుతుంది ఎందుకంటే వంటగదిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఆ వేడిమిలో అది మొలకెత్తుతుంది.
- అలాగే తేమ కారణంగా కూడా వెల్లుల్లి మొలకెత్తుతుంది. ఎందుకంటే వెల్లుల్లి తేమను పీల్చుకుంటుంది, దీని ఫలితంగా వెల్లుల్లి మొలకెత్తుతుంది.
కాబట్టి, వెల్లుల్లి మొలకెత్తకుండా ఉండాలంటే మీరు దానిని తేమ లేని, చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో ఉంచి నిల్వ చేయవచ్చు.