బియ్యంలో పురుగులు పోవాలంటే ఏం చేయాలి?

First Published | Dec 15, 2024, 12:30 PM IST

బియ్యం వారానికి ఒకసారి కొనుక్కునేవి కావు. ఒకేసారి సంవత్సరానికి సరిపడా కొనేస్తుంటాం. 3,4 నెలలకే బియ్యానికి తెల్ల పురుగు, నల్ల పురుగు పడుతుంటుంది. అయితే మీరు గనుక కొన్నిచిట్కాలను పాటిస్తే గనుక బియ్యానికి ఒక్క పురుగు కూడా పట్టదు. 

మన దేశంలో అన్నమే ప్రధాన ఆహారం. అన్నాన్ని మూడు పూటలా తింటుంటాం. అందుకే ప్రతి ఒక్కరి ఇండ్లలో సంవత్సరానికి సరిపడా బియ్యం ఉంటాయి. నిజానికి అన్నం లేకుండా ఉండటం చాలా కష్టం. ఒక్క పూట అన్నం తినకపోయినా.. బాగా ఆకలి వేస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. 

అన్నంలో పురుగుల బెడద

చాలా మంది ఇండ్లలో సంవత్సరం లేదా ఐదారు నెలలకు సరిపడా బియ్యం అయితే ఖచ్చితంగా ఉంటాయి.కానీ చాలా రోజుల పాటు బియ్యాన్ని నిల్వ చేస్తే ఖచ్చితంగా తెల్ల పురుగు, నల్ల పురుగు బియ్యంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా బియ్యం బస్తాల్లో పురుగులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పురుగులను ఏరేయడం చాలా కష్టం. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం బియ్యంలో ఒక్క పురుగు లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Tap to resize

బియ్యంలో పురుగులను ఎలా పోగొట్టాలి?

లవంగాలు

బియ్యంలో ఉన్న పురుగులను ఒక్కొక్కటి ఏరేయడం చాలా కష్టం. కానీ లవంగాలతో మాత్రం పురుగులు ఒక్కటి లేకుండా చేయొచ్చు. ఇందుకోసం పురుగులు ఉన్న బియ్యంలో 8-9 లవంగాలను వేయండి. లవంగాల ఘాటైన వాసనకు బియ్యంలో ఒక్క పురుగు లేకుండా పోతుంది. 

వేపాకు

వేపాకు బియ్యంలో పురుగులు లేకుండా చేయడానికి కూడా సహాయపడుతుంది. నిజానికి ఇది చాలా ఎఫెక్టీవ్ చిట్కా. ఇందుకోసం పేపాకు పొడిని తీసుకుని ఒక గుడ్డలో కట్టండి. దీన్ని పురుగులు ఉన్న బియ్యంలో వేయండి. ఈ వేపాకులో ఉండే లక్షణాలు బియ్యంలో పురుగులు పారిపోయేలా చేస్తాయి.

అగ్గిపెట్టె

అగ్గిపెట్టును మంటను వెలిగించడానికి మాత్రమే కాదు.. బియ్యంలో పురుగులను వెళ్లగొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. అవును బియ్యంలో అగ్గిపెట్టెను వేస్తే బియ్యంలో ఒక్క పురుగు లేకుండా పారిపోతుంది. ఎందుకంటే అగ్గిపెట్టెకు ఉండే సల్ఫర్ పురుగులను లేకుండా చేస్తుంది. ఒకవేళ మీరు బియ్యంలో అగ్గిపెట్టెను వేస్తే బియ్యాన్ని బాగా కడిగి వండాలి. 

వెల్లుల్లి:

వెల్లుల్లి కూడా బియ్యంలో పురుగులను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తీసి బియ్యంలో వేయండి. వెల్లుల్లి ఘాటుకు బియ్యంలో పురుగులు పారిపోతాయి. 

బిర్యానీ ఆకు:

బిర్యానీ ఆకును వంట చేయడానికి మాత్రమే కాదు.. బియ్యంలో పురుగులను పోగొట్టడాని కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం గాలివెళ్లని కంటైనర్ లో బియ్యాన్ని పోసి అందులో బిర్యానీ ఆకును వేసి ఉంచండి. 

మిరియాలు:

మిరియాల తో కూడా మీరు బియ్యంలో పురుగులు లేకుండా చేయొచ్చు. ఈ మిరియాల ఘాటైన వాసన బియ్యంలో పురుగులు పారిపోయేలా చేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఘాటైన వాసన వచ్చే మిరియాలను బియ్యంలో వేసి ఉంచడమే. 

Latest Videos

click me!