అయితే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులో ఓ కామన్ క్వాలిటీ ఉంది. అది హీరోయిన్ల విషయంలో. తమతో కలిసి నటించే హీరోయిన్ల విషయంలో ఇద్దరిలోనూ ఒకే వీక్‌నెస్ ఉందని తెలిపారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇద్దరూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లో చాలా వీక్ అని చెప్పాడు రాఘవేంద్రరావు. కృష్ణతోనూ, మహేష్‌తోనూ ఆయన సినిమాలు చేశారు.
కృష్ణతో `వజ్రయుద్దం`, `అగ్నిపర్వతం`, `ఊరికిమొనగాడు`, `శక్తి`, ` భలే కృష్ణుడు`, `ఘరానా దొంగ`, `అడవి సింహాలు` వంటి చిత్రాలు చేశారు. ఇందులో `వజ్రాయుధం` పెద్దగా ఆడలేదు. మిగిలిన అన్ని సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. మహేష్ ని హీరోగా పరిచయం చేస్తూ `రాజకుమారుడు` సినిమా చేశాడు.