మోకాల్లోతు వరదనీటితో... స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తున్న ఖాజీపేట రైల్వేస్టేషన్

Jul 27, 2023, 4:34 PM IST


వరంగల్ : భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. వరంగల్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షానికి పలు గ్రామాలు, రహదారులను వరద ప్రవాహం ముంచెత్తింది. ఇలా వరంగల్ నగరంలోకి కాజీపేట రైల్వే స్టేషన్ కు వరదనీటిలో మునిగింది. రైల్వే పట్టాలపై ప్లాట్ ఫాం వరకు వరదనీరు నిలిచాయి. దీంతో ఖాజీపేట రైల్వే స్టేషన్ చిన్న స్విమ్మింగ్ ఫూల్ ను తలపిస్తోంది. వరంగల్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి కింద కూడా వరదనీరు భారీగా నిలిచింది.