సిరిసిల్లలో హృదయవిదారక ఘటన ... హాస్పిటల్ నుండే వృద్దురాలి అంతిమయాత్ర

Oct 23, 2022, 2:05 PM IST

సిరిసిల్ల : ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకురావ్వకుండా యజమాని అమానుషంగా ప్రవర్తించిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. క్రిష్ణమ్మ(65) అనే వృద్దురాలు హాస్పిటల్లో చికిత్సపొందుతూ చనిపోగా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు చేయాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే వారు నివాసముండేది అద్దె ఇల్లు కావడంతో యజమాని అనుమతి కోరగా అతడు నిరాకరించారు. మృతదేహాన్ని తన ఇంట్లోకి తీసుకురావడానికి యజమాని నిరాకరించడంతో చేసేదేమిలేక కుటుంబసభ్యులు హాస్పిటల్ నుండి అంతిమయాత్ర చేపట్టారు. హాస్పిటల్ పరిసరాల్లోనే పాడె ఏర్పాటుచేసి క్రిష్ణమ్మ మృతదేహాన్ని దానిపై స్మశానవాటికకు తరలించారు.