సాగర్ లో జానారెడ్డి గెలిస్తే జరిగేదదే: హోంమంత్రి మహమూద్ అలీ

Apr 6, 2021, 10:29 AM IST

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గొప్ప లీడర్ గా బయట చెబుతారు కానీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చిన్న లీడర్ చేసిన అభివృద్ధిని కూడా ఆయన చేయలేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా త్రిపురం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ...  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా అనేక పదవులను అనుభవిస్తూ జానారెడ్డి చేసిన అభివృద్ధి  శూన్యమన్నారు.
జానారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమి అభివృద్ధి చేయలేదు... ఇప్పుడు గెలిచి ఎమ్ చేస్తారు ప్రతిపక్షంలో కూర్చోడం తప్ప అని ఎద్దేవా చేశారు.రెండు సంవత్సరాలలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలు ఎన్నడూ మరువలేరు మహమూద్ అలీ అన్నారు.