Oct 28, 2022, 1:30 PM IST
దుబాయ్ ఎయిర్పోర్టు లో చిక్కుకున్న ఆరుగురిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా ఇండియాకు రప్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల వాసులు దుబాయ్ ఎయిర్ పోర్టు లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు దుబాయ్ సామాజిక సేవ కార్యకర్త గుండెల్లి నర్సింహులన్నతో పాటు ఎంబసీ అధికారులు కంపెనీ నిర్వాహకులతో మాట్లాడి ఆరుగురు యువకులను క్షేమంగా ఇండియా పంపించారు. నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీర్నపల్లి మండల జెడ్పీటీసీ కల సురేష్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి ,చాంద్ పాషాలు, ఆరుగురు యువకులకు స్వాగతం పలికి స్వగ్రామానికి తీసుకువస్తున్నారు.