వింధ్య ఆర్గానిక్స్ లో భారీ పేలుళ్లు: ఎగిసిపడుతున్న మంటలు

Dec 12, 2020, 2:02 PM IST

సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి ఐడీఎ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. దీంతో పెద్ద యెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.