ధాన్యం కొనడంలేదంటూ చొప్పదండిలో రైతుల రాస్తారోకో

May 26, 2020, 5:30 PM IST

చొప్పదండి మండలం చాకుంటా గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఒకవేళ తీసుకున్నా క్వింటాలుకు 8 కిలోలు నుండి 10 కిలోలు తాలు, తరుగు పేరు మీద  రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, లక్ష్మణ్, దేవేందర్, తదితరులు రాస్తారోకో మద్దతుగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.