Mar 14, 2023, 1:45 PM IST
ధర్మపురి : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు ఎగరేస్తున్నారు. ఇటీవల ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు మరిచిపోకముందే తాజాగా ధర్మపురి బిజెపి నేత అంజయ్ రాష్ట్ర బిజెపి చీఫ్ తీరుపై సంచలన కామెంట్స్ చేసారు. దళితుల పట్ల సంజయ్ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా వుందని... ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత దక్కడం లేదని అన్నారు. కార్పోరేట్ల మాదిరిగా పార్టీని నడిపిస్తున్నారని... 20 ఏళ్లుగా పార్టీకోసమే పనిచేస్తున్న తన లాంటి వారికి గుర్తింపు లేదని వాపోయారు. సంజయ్ వ్యవహార తీరుపై బిజెపి హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు అంజయ్య తెలిపారు.
ఇక బిజెపి కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిపైనా అంజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరం లేదని స్యయంగా వివేక్ చెప్పారని ఆరోపించారు. ధర్మపురిలో వివేక్ అరాచకాలు ఎక్కువయ్యాయని... అన్ని పార్టీల్లోనూ తన చుట్టాలనే పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని వివేక్ పై అంజయ్య ఆరోపణలు చేసారు.