Mar 5, 2020, 12:12 PM IST
హైదరాబాదీలను కరోనా వణికిస్తోంది. సికింద్రాబాద్ లో ఓ టెక్కీ కరోనా బారిన పడడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు మరింత ముమ్మరం చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాలలో శుభ్రతను పెంచింది. జనం రాకపోకలు ఎక్కువగా ఉండే మెట్రో రైల్ శానిటైజ్ కార్యక్రమం జరుగుతుంది. మెట్రో రైలు, స్టేషన్లు, లిఫ్టులు...తాకగలిగే ప్రతీ ప్రాంతాన్నీ..క్షుణ్ణంగా శానిటైజ్ చేస్తున్నారు.