Apr 23, 2021, 3:38 PM IST
కరీంనగర్: మానేరు తీరంలో కరోనా మృతదేహాల అంత్యక్రియలు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. మానేరు నదీ తీరాన చితి మంటలు వరుసగా పేర్చి కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను దహనం చేస్తున్నారు. కాలుతున్న శవాల లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే చోట 18 చితి మంటలను గుర్తించడంతో జిల్లాలో కలకలం రేగింది.