Aug 14, 2020, 1:31 PM IST
సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి చేరిన వరద నీరు. సింగరేణి వ్యాప్తంగా 1.40 లక్షల టన్నుల ఉత్పత్తికి ఆటంకం.నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రెండు రోజుల నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం ఏర్పడుతుంది రాష్ట్రంలోని కరీంనగర్ ,ఆదిలాబాద్, ఖమ్మం ,వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.