Oct 24, 2022, 1:46 PM IST
నల్గొండ : మునుగోడు ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 18 వేల కోట్లు కాంట్రాక్ట్ తీసుకుని కోమటిరెడ్డి బిజెపిలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగపూట కోమటిరెడ్డి 18వేల కోట్లకు అమ్ముడుపోయాడంటూ 18,000 వాలా టపాసులను కాలుస్తూ నిరసన తెలిపారు చౌటుప్పల్ కు చెందిన యువకులు. ఇలా మునుగోడు ఆత్మగౌరవాన్ని డిల్లీలో తాకట్టుపెట్టిన కోమటిరెడ్డికి ఉపఎన్నికలో తగిన బుద్ది చెబుతామని యువకులు హెచ్చరించారు.