సకాలంలో గుండె రీప్లేస్ మెంట్ అయ్యేలా చేసి...భేష్ అనిపించుకున్న ట్రాఫిక్ పోలీసులు

Feb 20, 2020, 1:38 PM IST

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ గుండెను అపోలో ఆసుపత్రిలో వున్న మరో పేషెంట్ కి అమర్చడంలో సాయపడ్డారు. ట్రాఫిక్ లో ఆలస్యం కాకుండా కంట్రోల్ చేసి గుండెను సరైన సమయంలో అమర్చేందుకు తోడ్పడ్డారు.