కరోనా ఖచ్చితంగా వస్తుంది.. కానీ.. ఎమ్మెల్యే రాజా సింగ్

Jun 20, 2020, 1:57 PM IST

కరోనా నాకు వచ్చినా దాన్ని ఓడిస్తానంటున్నారు ఘోషమహాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజసింగ్. నిన్న ఆయనగన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాజాసింగ్ కు కూడా కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి జనాల్లో తిరగడం తప్పదు. నా జాగ్రత్తల్లో ఉంటా అంటూనే తనలాగే అందరూ ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యంత ఇవ్వాలన్నారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ రోగనిరోధక శక్తిని, శరీరధారుడ్యాన్ని పెంచుకోవాలని కోరారు.