కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యుత్ స్తంబానికి ఉరితీసి... కేటీఆర్ ఇలాకాలో బిజెపి వినూత్న నిరసన

Mar 8, 2022, 5:28 PM IST

సిరిసిల్ల: ఐటీ మంత్రి కేటీఆర్ ఇలాకాలో బిజెపి నాయకులు వినూత్నంగా నిరసన తెలియజేసారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను సెంట్రల్ లైటింగ్ కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలకు వేలాడదీసి నిరసన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో నల్ల కండువాలతో నిరసనకు దిగిన బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బిజెపి శ్రేణులు ఈ నిరసన చేపట్టాయి. ఎల్లారెడ్డిపేటలోని ప్రధాన రహదారి మధ్యలో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేసారు.  ఇందులో ఓ స్తంబానికి కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి వేసినట్లు వేలాడదీశారు బిజెపి నాయకులు. అనంతరం మరో దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు పోలీసులు అడ్డుకోగా గందరగోళం నెలకొని బిజెపి నాయకులపై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఆగ్రహించిన నాయకులు పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు.