గౌరవెల్లి నిర్వాసితులను పరామర్శించిన బండి సంజయ్... కన్నీటీపర్యంతమైన బాధిత మహిళలు

Jun 15, 2022, 10:07 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ కోసం తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు, ప్రజలు పరిహారం కోసం ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. ఇలా గుడాటిపల్లిలో ఆందోళనకు దిగిన నిర్వాసితులపై ఇటీవల పోలీసులు లాఠీచార్జ్ చేసారు. ఈ లాఠీచార్జ్ గాయపడిన నిర్వాసితులను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.  
గుడాటిపల్లిలో నిర్వాసితులు నిరసన చేపట్టిన టెంట్ వద్దకు చేరుకున్న సంజయ్ గాయపడినవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళలు కన్నీటిపర్యంతం అవుతూ తమ ఆవేదనను ఆయనకు తెలిపారు. పోలీసుల దెబ్బను తాళలేకపోయామంటూ ఒంటిపై అయిన గాయాలను బండి సంజయ్ కు చూపించారు నిర్వాసితులు. నిర్వాసితుల టెంట్ వద్ద కూర్చుని బాధితుల సమస్యలను విన్నారు బండి సంజయ్.