Dec 9, 2019, 10:42 AM IST
గ్రేటర్ హైదరాబాద్ మెగాఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ MD నూర్ అహ్మద్ ఆదివారం ఉదయం ముషీరాబాద్ లోని ఓ దర్గాలో అకాలమరణం చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లు ఆయన నివాసానికి వచ్చారు. కుటుంబాన్ని ఓదార్చారు. కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటానని, మార్చ్ 1న జరగాల్సిన నూర్ భాయ్ కూతురి పెళ్లి జరపడమే ఆయన ఆత్మకు శాంతి అని తప్పకుండా జరిపిద్దాం అని చిరంజీవి అన్నారు. ఆయన మంచితనాన్ని మూటగట్టుకుని వెళ్లాడని, ఎంత అవసరమైనా డబ్బులు అడిగేవాడు కాదని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ కూడా కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని చెప్పారు.