Oct 22, 2019, 1:37 PM IST
బ్యాంకుల విలీనం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువుందని, బ్యాంకులు పెద్దగా ఉన్నంత మాత్రాన వాటి పనితీరు మెరుగవుతుందనుకోవడం అబద్ధమని బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ నాయకులు తెలిపారు. హిమాయత్ నగర్ లోని అలాహాబాద్ బ్యాంకు జోనల్ కార్యాలయం వద్ద వారు ఒక రోజు సమ్మెకు దిగారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ, బ్యాంకులను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాహాబాద్ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయబోతున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.