Jan 11, 2023, 5:10 PM IST
జగిత్యాల : జగిత్యాలలోని మాతా శిశు హాస్పిటల్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.ఎస్. లత సందర్శించారు. ఇటీవల ఈ హాస్పిటల్లో కాన్పు చేయించుకున్న మహిళలకు డాక్టర్ల నిర్లక్ష్యంగా వైద్యం చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ హాస్పిటల్ విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్పిటల్ కు చేరుకుని ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లు ఊడిపోయి నరకయాతన అనుభవిస్తున్న మహిళలతో ఆమె మాట్లాడారు. ఇలా 10 మంది బాలింత మహిళలు, వారి బంధువులతో అడిషనల్ కలెక్టర్ మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ లత తెలిపారు.