మారుమూల తండాలో 27కరోనా కేసులు... సెల్ప్ లాక్ డౌన్ లోకి గ్రామం

Apr 4, 2021, 12:54 PM IST

జగిత్యాల: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ  రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని మారుమూల తండా సిరిపురంలో ఒకేరోజు  27మంది కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య మరింత పెరగకుండా గ్రామపంచాయతి పాలకవర్గం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఏప్రిల్ 3వ తేది నుండి 15వ తేది వరకి గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు.   ఈ పదమూడు రొజుల పాటు గ్రామంలోని హోటల్లతో పాటు ఇతర వ్యాపారాలు పూర్తిగా మూసివెయాలని తిర్మానం చేశారు. అయితే కిరాణా, పర్టిలైజర్, ఎలక్ట్రానిక్ షాపులు మాత్రం ఉదయం 6 నుండి 10 గంటల వరకి తిరిగి సాయంత్రం 5 నుండి 9 వరకి తెరవడానికి అనుమతిచ్చారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళినపుడు మాస్కులు ధరించకుంటే 1000 ఫైన్ వేయనున్నట్లు తెలిపారు.