Sep 24, 2020, 7:43 AM IST
ఐపీఎల్ 2020లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడబోతోంది. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిపోయిన కింగ్స్ ఎలెవన్ ఈ మ్యాచ్ లో గెలవాలన్న కసితో ఉంది. ఇక హైదరాబాద్ టీం మీద ఇప్పటికే ఓ విజయాన్ని నమోదు చేసుకున్న కోహ్లీ టీం ఈ మ్యాచ్ లో కూడా గెలవాలన్న కసితో ఉంది. ఈ రెండు టీంలూ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఫైనల్ కయితే వెళ్లాయి కానీ కప్పు గెలవలేదు. కాబట్టి ఈ రెండు టీం ల మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్ టఫ్ గా ఉండబోతోందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి చెబుతున్నారు..