Oct 12, 2022, 10:14 AM IST
న్యూడిల్లీ : ఇటీవలే బీఆర్ఎస్ ను ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పదును పెడుతున్నారు. దేశ రాజధాని నుండి రాజకీయ వ్యూహాలు రచించేందుకు ఇప్పటికే డిల్లీలో తాత్కాలికంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. మొదటిసారిగా ఈ కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిసాక డిల్లీకి చేరుకున్న కేసీఆర్ బిఆర్ఎస్ ఆఫీస్ ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందికి పలు సలహాలు, సూచనలిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.