Solar Eclipse : చిన్నారిని మట్టిలో పాతిన తల్లిదండ్రులు..ఎందుకంటే...

Dec 27, 2019, 12:34 PM IST

సూర్యగ్రహణం సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.  సూర్యగ్రహణం సమయంలో మట్టిలో పాతి పెడితే చిన్నారుల అంగవైకల్యం పోతుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి తమ కన్నకొడుకును మూడు గంటలపాటు మట్టిలో పాతారు ఓ తల్లిదండ్రులు. ఈ ఘటన ఉత్తర కర్ణాటకలోని తాజ్‌సుల్తాన్‌పురాలో జరిగింది. ఉత్తర కర్ణాటక అంతటా ఇదే మూఢాచారం కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ఈ ఘటన పై జన విజ్ఞాన వేదిక అసహనం వ్యక్తం చేసింది.