Feb 28, 2020, 11:16 AM IST
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు దాటినా కూడ నేటీకి కొన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇలాంటి ఘటనే ఒకటి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. రోడ్డు సౌకర్యం లేని కారణంగా ఐదు కి.మీ దూరం పాటు గర్భిణీని మంచంపై మోసుకెళ్లారు. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బాలరాంపూర్ లో చోటు చేసుకొంది. సరైన రోడ్డు సౌకర్యం లేని కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఈ గ్రామం నుండి రోగులను మంచంపై మోసుకెళ్తున్నారు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం నిధులు మంజూరైనట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు.